శ్రీవారి సేవలో సంగీత దర్శకుడు

TPT: ప్రముఖ సినీ దర్శకుడు మణిశర్మ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మణిశర్మతో పలువురు ఫొటోలు దిగారు.