కొత్తగూడెంలో కేజ్రీవాల్ పుట్టినరోజు వేడుక

BDK: కొత్తగూడెం మండల కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ జన్మదిన వేడుకలు జిల్లా కన్వీనర్ రాంబాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి ఆటోడ్రైవర్లకు, ట్రాలీ వారికి పంచి పెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆ భగవంతుని చల్లని దీవెనలతో కేజ్రీవాల్ సుఖ సంతోషాలతో ఉండి ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆప్ సభ్యులు ఆకాంక్షించారు.