టీమిండియాపై చంద్రగ్రహణం ఎఫెక్ట్
చంద్రగ్రహణం కారణంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు ఆటంకం కలిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సా.6 గంటల నుంచి రా.9 గంటల వరకు భారత్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే, సా.6:47 గంటల వరకు గ్రహణం ప్రభావం ఉండటంతో, ప్రాక్టీస్ సెషన్‌ను గంట సేపు వాయిదా వేశారు. గ్రహణం సమయంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.