కోడికి రెక్కలు.. కొండెక్కిన చికెన్ ధరలు

కోడికి రెక్కలు.. కొండెక్కిన చికెన్ ధరలు

నారాయణపేట జిల్లాలో మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. డ్రెస్డ్ చికెన్ రూ. 280 నుంచి రూ. 290 వరకు, స్కిన్‌లెస్ చికెన్ రూ. 300 నుంచి 320 వరకు పలుకుతోంది. అయితే అంతర్జాతీయ పరిణామాలు పౌల్ట్రీ రంగంపై భిన్నమైన ప్రభావం చూపడం, వేసవి కాలం ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.