రేపు రాజమండ్రిలో రక్తదాన శిబిరం

E.G: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు రాజమండ్రిలోని రౌతు తాతలు కళ్యాణ మండపం వద్ద రేపు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేయడం ఒక గొప్ప మానవతావాద చర్య అని అన్నారు.