ఈ నెల 31 నుంచి చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు

ఈ నెల 31 నుంచి చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని స్థానిక చౌడేశ్వరి కాలనీలో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 2 వరకు జ్యోతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు శనివారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 31న గణపతి పూజ, పంచామృతాభిషేకం, సాయంత్రం సహస్రనామార్చన ఉంటాయి. ఏప్రిల్ 1న 108 బిందెలతో అభిషేకం, 2న కలశమార్జనం, చండీ హోమం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు.