తోటి విద్యార్థికి ఆర్ధిక సాయం అందజేత

తోటి విద్యార్థికి  ఆర్ధిక సాయం అందజేత

WGL: చెన్నారావుపేట మండలం అమీనాబాద్ మోడల్ స్కూల్ కళాశాలకు చెందిన కుక్కల సింధు తండ్రి రాజు మరణంతో ఆమెను తోటి విద్యార్థినులు పరామర్శించారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన సింధు తాజాగా తండ్రిని కోల్పోవడం బాధాకరమని తెలిపారు. అనంతరం రూ.3000 ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.