పాఠశాలలో తాగునీటి సమస్యకు పరిష్కారం
ATP: సెట్టూరు మండలం మఖైరేవు గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు తాగునీటి సమస్య తీరింది. పాఠశాలలో కొత్తగా వేసిన బోర్ కోసం మోటార్, పంపుసెట్ కొనుగోలుకు ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బద్రీనాయక్ మూడ్ రూ. 40 వేలు అందించారు. ట్రస్ట్ ఛైర్మన్‌కు గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.