కడివెళ్ళలో ఇరుకైన రహదారి.. రైతులకు ఇబ్బందులు

కడివెళ్ళలో ఇరుకైన రహదారి.. రైతులకు ఇబ్బందులు

KRNL: ఎమ్మిగనూరు మండలం కడివెళ్ళ గ్రామం గంజహళ్లి రహదారి ఇరుకుగా మారడంతో రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లు, ఇతర వాహనాలు సాఫీగా రాకపోకలు చేయలేకపోవడంతో పనులకు అంతరాయం కలుగుతున్నాయని తెలిపారు. గ్రామానికి కీలకమైన ఈ రహదారి సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.