'ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'

'ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'

E.G: రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నవంబర్ 4వ తేదీ నుంచి 6 వరకు లండన్‌లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ - 2025 సమావేశానికి మంత్రి శనివారం సాయంత్రం రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి నాయకులు శుభాకాంక్షలు చెప్పారు.