VIDEO: దసరా ఉత్సవాలకు అమ్మవారి విగ్రహాలు సిద్ధం
GNTR: దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాలలో ఈనెల 22వ తేదీ సోమవారం నుంచి 11 రోజుల పాటు జరగనున్న దసరా ఉత్సవాల కోసం సింహ వాహనంపై కూర్చున్న అమ్మవారి విగ్రహాలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. 30 సంవత్సరాలుగా తమ కుటుంబంలో మహిళలు వినాయక చవితికి గణపతి విగ్రహాలు, దసరాకు అమ్మవారి విగ్రహాలను తయారు చేసి అమ్ముతున్నారని విగ్రహాల తయారీదారులు ఆదివారం తెలిపారు.