పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

KNR: శంకరపట్నం మండలం ఎరడపల్లిలో సర్పంచ్ రజిత పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుకవ్రారం పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రత్యేక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 289 పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పశువుల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. గాలికుంటు వంటి అంటువ్యాధుల నుంచి రక్షణకు టీకాలు అత్యంత ముఖ్యమన్నారు.