శబరిమలకు 16 రోజుల్లో రికార్డు ఆదాయం
కేరళ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి 16 రోజుల్లో రూ.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. 16 రోజుల్లో ఈ ఆదాయం రావటం రికార్డ్ అని తెలిపింది. ఇప్పటివరకు 13.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపింది. అదే సమయంలో ప్రసాదం విక్రయాల ద్వారా ఆదాయం 47 శాతం.. గతేడాదితో పోలిస్తే హుండీ ఆదాయం 18.18 శాతం పెరిగిందని చెప్పింది.