గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NLG: పెద్దవూరలో గంగమ్మ జాతరను సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరినీ ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జటావత్ రవి నాయక్, మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, యూత్ అధ్యక్షులు మెండే సైదులు, తదితరులు పాల్గొన్నారు.