కృత్యమేళా ప్రదర్శన.. జిల్లా స్థాయికి ఎంపిక

WGL: పర్వతగిరి మండల స్థాయి కృత్యమేళా ప్రదర్శన సోమవారం ముగిసింది. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తయారు చేసిన వివిధ కృత్యాలను ఎమ్మార్సీ కార్యాలయంలో ప్రదర్శించారు. వీటిలో 8 కృత్య నమూనాలను జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేసినట్లు ఎంఈవో లింగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్, కాంప్లెక్స్ హెచ్ఎంలు రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.