రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

NLR: కోవూరు వారధి సెంటర్ వద్ద భారీ ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి బోల్తా పడగా, బైక్‌ను తప్పించబోయిన టాటా ఏస్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు సేఫ్టీ లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.