బైకులు ఢీ.. ఒకరు మృతి

బైకులు ఢీ.. ఒకరు మృతి

KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సోమేశ్వర వార్డు సభ్యుడు దేవుళ్ల హన్మంతు (40) దుర్మరణం పాలయ్యారు. కానిస్టేబుల్ మతీన్ బైక్‌ను మరో రెండు బైకులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలవ్వగా, బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు.