మంజీరా నదిలో వరద ప్రవాహాన్ని పరిశీలించిన అధికారులు

NZB: పోతంగల్ మండలంలోని మంజీరా నదిలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద నీరుతో బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవహం పెరిగింది. దీంతో పోతంగల్ ఎమ్మార్వో గంగాధర్, ఎంపీడీవో చందర్ శనివారం సందర్శించారు. వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో జాలరులు చేపలు పట్టేందుకు వెళ్ళవద్దని, ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు.