రేపు హాలియా బంద్.. ఎందుకంటే

NLG: నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం హాలియా మొబైల్స్ అసోసియేషన్ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. 'మార్వాడీ గో బ్యాక్' నినాదంతో ఓయూ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు హాలియాలో స్వచ్ఛంద బంద్ చేపట్టినట్లు చెప్పారు. మార్వాడీలు నాసిరకం సామగ్రిని తక్కువ ధరకు అమ్ముతూ కస్టమర్లని, లోకల్ వ్యాపారస్థులను నష్ట పరుస్తుంది.