చెరువులో పడి విద్యార్థి మృతి

CTR: నగరి కేవీపీఆర్ పేటకు చెందిన విద్యార్థి చెరువులో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. 9వ తరగతి చదువుతున్న యువరాజ్(14) శుక్రవారం సెలవు కావడంతో స్నేహితులతో కలసి గుండ్రాజుకుప్పం దళితవాడ సమీపంలో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. ఆట ముగిశాక మైదానం పక్కనే ఉన్న చెరువులో ఈతకు దిగాడు. లోతు ఎక్కువై నీట మునిగిపోవడంతో మృతి చెందాడు.