'సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'

'సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'

VZM: ప్రజలు చెప్పిన సమస్యలకు పరిష్కారం జరిగేల కృషి చేయలని అధికారులకు, ఉద్యోగులకు దత్తిరాజేరు ఎంపీపీ గేదెల సింహాద్రి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో అప్పలనాయుడు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను గ్రామ సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు.