పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ
KMR: పోలీస్ సిబ్బందిని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. భిక్కనూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నానని 100 నంబర్‌కు డయల్ చేశారు. తక్షణమే స్పందించిన కానిస్టేబుల్స్ వినయ్ కుమార్, రామాంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి అతని ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ అభినందిస్తూ నగదు ప్రోత్సాహం అందజేశారు.