'లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు'

'లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు'

ASR: పెన్షన్ సొమ్ము కోసం ఆందోళన చెందవద్దని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు లబ్దిదారులకు సూచించారు. డిప్యూటీ ఎంపీడీవో టీ. శ్రీనివాసరావు, కార్యదర్శి శంకర్‌తో కలిసి బుధవారం లుబ్బర్తి, లొద్దిపాకలు గ్రామాల్లో పర్యటించి, పెన్షన్ లబ్దిదారులతో సమావేశమయ్యారు. పెన్షన్ సొమ్ము రూ.2లక్షల 88వేలతో వెటర్నరీ అసిస్టెంట్ అదృశ్యం కావడంతో వారికి పంపిణీ నిలిచిందన్నారు.