బనగానపల్లెలో పర్యటించిన మంత్రి

బనగానపల్లెలో పర్యటించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ పర్యటించారు. బనగానపల్లెలోని జుర్రేరు వాగు సమీపంలో ఉన్న డ్రైనేజీ నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.