శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత హల్‌చల్

శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత హల్‌చల్

AP: తిరుపతిలో ఇవాళ ఉదయం మరోసారి చిరుత హల్‌చల్ చేసింది. 150వ మెట్టు వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా భక్తులు చూశారు. అనంతరం వారు భయంతో గట్టిగా కేకలు వేయడంతో అదృష్టవశాత్తు చిరుత అక్కడి నుంచి పరారైంది. దీంతో అక్కడున్న వారు టీటీడీ, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. భక్తులెవరూ ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగుంపులుగా మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.