పృథ్వీశ్వర స్వామి దేవస్థానానికి భక్తురాలి వితరణ
కృష్ణా: చల్లపల్లి మండలం నడకుదురులోని ప్రాచీన శైవక్షేత్రం శ్రీ పృథ్వీశ్వర స్వామి దేవస్థానానికి చెన్నై భక్తురాలు యార్లగడ్డ విజయకుమారి రూ.70వేలు విలువ చేసే కంచు గంట, రెండు ఇత్తడి దీపపు కుందులు బహుకరించారు. దేవస్థానం అర్చకులు మామిళ్ళపల్లి పృథ్వీ కళ్యాణ్ పూజలు చేసి ఆలయంలో అలంకరించారు. ఈ కార్యక్రమంలో మండవ రవీంద్ర - రమణకుమారి దంపతులు పాల్గొన్నారు.