నేడు నగరానికి వర్ష సూచన
RR: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గాలి వేగం గంటకు 40-50 కి.మీ.వేగంతో వీచే అవకాశం ఉంది. ఈదురుగాలులతో నగరంలో విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.