సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

NLG: నల్గొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన రాపోలు లక్ష్మీనారాయణకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మంజూరైన రూ. 60 వేల రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కును గ్రామ కాంగ్రెస్ నాయకులు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కాసాని లింగ స్వామి గౌడ్, బొమ్మగోని సైదులు గౌడ్, రాసమల్ల వెంకన్న, ముక్కామల శేఖర్ యాదవ్ తదితరులు ఉన్నారు.