కాగజ్‌నగర్ MROకి షోకాజ్ నోటీసు జారీ

ASF: భూభారతి కార్యక్రమానికి సంబంధించి రెవెన్యూ ఫైళ్లను నిర్దేశించిన గడువులోగా సమర్పించడంలో విఫలమైనందున కాగజ్ నగర్ MRO మధుకర్‌కి సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఉన్నతాధికారులు, పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ విధుల్లో నిర్లక్ష్యం వహించారన్నారు. CCA నిబంధనలు ఉల్లఘించినట్లు నోటీసులో పేర్కొన్నారు. 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నారు.