రైతు భరోసాపై భట్టి కీలక అప్‌డేట్

HYD: గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రూ.66 వేల కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి తెచ్చారన్నారు. ఇప్పటి వరకు రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ప్రతి ఎకరా సాగుభూమికి ఈనెల 26న రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ.8,400 కోట్లు వేయబోతున్నట్లు స్పష్టం చేశారు.