గుడిమల్లం రోడ్డుకు రూ.2.30 కోట్ల మంజూరు.!
TPT: గుడిమల్లం శ్రీపరశురామేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పాపానాయుడు పేట బైపాస్‌లో తారు రోడ్డు, గుడిమల్లంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ.2.30 కోట్లు కేటాయించారు. దీంతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి, వెంకట సుధీర్ రెడ్డికి ఆలయ మాజీ ఛైర్మన్ బత్తల గిరినాయుడు కృతజ్ఞతలు తెలిపారు.