స్నేహితుడు కుటుంబానికి అండగా నిలిచిన బాల్యమిత్రులు

స్నేహితుడు కుటుంబానికి అండగా నిలిచిన బాల్యమిత్రులు

WGL: ఆపదలో ఉన్న వ్యక్తికి బాల్యమిత్రులు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన శీలం రాజు కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన రాజు బాల్య స్నేహితులు మానవత్వంతో ఆలోచించి రూ.20వేలు సేకరించారు. ఇవాళ ఉదయం ఈ డబ్బును రాజు కుటుంబ సభ్యులకు అందజేశారు.