రూ.20లకే, రూ.2 లక్షల ప్రమాద బీమా

రూ.20లకే, రూ.2 లక్షల ప్రమాద బీమా

ప్రకాశం: రూ.20కే రూ.2 లక్షలు ప్రమాద బీమా పొందాలని రాచర్ల ఏపీఓ మహాలక్ష్మి శనివారం తెలిపారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఈ పథకం వర్తిస్తుందని మే 30వ తేదీ లోపు ఉపాధి కూలీలు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మరణించిన లేదా అంగవైకల్యం పొందిన ఉపాధి కూలీలకు రూ.2 లక్షలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.