'నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'
KMM: మధిరలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ అగ్నిప్రమాద బాధిత రైతులు మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తెలంగాణ రైతు సంఘం నేతల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మార్చి 21న జరిగిన ప్రమాదంలో మిర్చి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే వంద శాతం బీమా పరిహారం, ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అన్నారు.