జాతీయ అవార్డుకు ఎంపికైన చెల్పూర్ వాసి

జాతీయ అవార్డుకు ఎంపికైన చెల్పూర్ వాసి

BHPL: గణపురం (M) చెల్పూర్ గ్రామానికి చెందిన నర్సయ్య ప్రతిష్ఠాత్మక 'కొండా లక్ష్మణ్ బాపూజీ జాతీయ అవార్డు'కు ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ (BSA) ఆధ్వర్యంలో ఈ నెల 15న తిరుపతిలో జరిగే కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు రాధాకృష్ణ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షుడిగా నర్సయ్య అందిస్తున్న సేవలకు గాను ఈ గుర్తింపు లభించింది.