బైక్‌ను ఢీకొన్నటిప్పర్ లారీ.. ఒకరికి తీవ్ర గాయాలు
ఏలూరులోని ఫైర్ స్టేషన్ వద్ద శుక్రవారం ఓ టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనదారుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ట్రాఫిక్ పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.