SKUలో ఆరుగురు విద్యార్థులు డిబార్
ATP: అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU) పరిధిలో జరుగుతున్న డిగ్రీ 3, 5 సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ జీవీ రమణ తెలిపారు. అనంతపురం, ధర్మవరం, గుత్తి, హిందూపురంలోని డిగ్రీ కళాశాలలకు చెందిన ఈ ఆరుగురిపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.