వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

వనపర్తి: వ్యక్తి అదృశ్యమైన సంఘటన శనివారం వనపర్తి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. పట్టణంలోని ప్యాటగడ్డ కాలనీకి చెందిన మండ్ల గోపాల్ (60) ఫిబ్రవరి 24న కుటుంబ తగాదాలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. చుట్టుప్రక్క గ్రామాలలో బంధువుల వద్ద ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.