కాండ్రకోటలో వైభవంగా నూకాలమ్మ జాతర ప్రారంభం
KKD: పెద్దాపురం మండలం కాండ్రకోటలో నూకాలమ్మ తల్లి మహా జాతర మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈవో రాంబాబు రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలను టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ ప్రారంభించారు. మార్చి 17 నుంచి మే 3 వరకు ఈ జాతర కొనసాగనుంది. గరగ నృత్యాలు, బాజాభజంత్రీలు, చిత్ర విచిత్ర వేషధారణలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.