ఆదోని జిల్లా సాధనకై జేఏసీకి బీఎస్పీ మద్దతు
KRNL: ఆదోని జిల్లా సాధనకు జేఏసీకి ఎమ్మిగనూరులో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీ నారాయణ మద్దతు ప్రకటించారు. పశ్చిమ ప్రాంతం తీవ్రంగా వెనుకబడిపోయిందని, రైల్వే లైన్, వేదవతి–గుండ్రేవుల ప్రాజెక్టులు, రాజోలిబండ కుడి కాలువ వంటి పనులు నిలిచిపోవడం పాలకుల నిర్లక్ష్యమని అన్నారు. ఆదోనిని జిల్లాగా వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.