రాజీవ్‌కు యాక్సిడెంట్ జరిగింది: సుమ
తనకు వచ్చే కళలు నిజమవుతాయని యాంకర్ సుమ కనకాల చెప్పింది. ఒకసారి రాజీవ్‌కు షూటింగ్‌లో ప్రమాదం జరిగిందని తెలిపింది. అయితే ఆ ప్రమాదం గురించి తనకు ముందే కల వచ్చిందని పేర్కొంది. అలాగే వారిద్దరిపై వస్తోన్న డివోర్స్ వార్తలపై స్పందిస్తూ.. ఇన్ని ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు చూశామని తెలిపింది. ఆ వార్తలకు చెక్ పెడుతున్నా మళ్లీ వస్తూనే ఉన్నాయని వెల్లడించింది.