'విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు'
VZM: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని బొబ్బిలి ఎంపీడీవో రవికుమార్ హెచ్చరించారు. బుధవారం స్దానిక బుర్జావలస సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూవ్మెంట్ రిజిస్టర్ నిర్వహణ చేయాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు.