వెంకన్న ఆలయంలో ముగ్గురు సిబ్బంది తొలగింపు

కోనసీమ: అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ముగ్గురిని అన్యమతస్తులుగా గుర్తించి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆలయ ఈవో యర్రా వెంకటేశ్వరరావు తెలిపారు. అనూష దేవి, సుబ్బలక్ష్మి, నాగేంద్రబాబును విధుల నుంచి తొలగించామని తెలిపారు. ఫోటోలు, వీడియోలు అధికారులకు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.