చంద్రశేఖరపురంలో నారాయణస్వామికి ప్రత్యేక పూజలు

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన నారాయణస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని, పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.