పెళ్లి వేడుకకు హాజరైన డిప్యూటీ సీఎం

కృష్ణా: మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారి పెళ్లి వేడుక కంకిపాడులో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు రాజకీయ నాయకులు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతోపాటు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, కలెక్టర్ డీకే బాలాజీ, తదితరులు ఉన్నారు.