ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛ కార్యక్రమం
NZB: ఆర్మూర్ పట్టణంలోని జండా గల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల రాంమందిర్ ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. స్థానిక కౌన్సిలర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పాఠశాలలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.