వాహనం ఢీకొని వ్యక్తి మృతి.!
MDK: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన హవెలి ఘనపూర్ మండల పరిధిలోని లింగసానిపల్లి వద్ద రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. లింగసానిపల్లి తండాకు చెందిన ముడావత్ భాస్కర్(36) లింగసానిపల్లి తండా వైపు బైక్ పై వెళ్లే క్రమంలో సమీపంలో ఉన్న మలుపు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు.