జగ్గయ్యపేటలో ఉచిత వైద్య శిబిరం

NTR: జగ్గయ్యపేట పట్టణంలో మూడు రోజుల ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేయబడిందని అన్నారు. విభిన్న రంగాల వైద్య నిపుణులు ఈ శిబిరంలో ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.