నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్
ప్రకాశం: మార్కాపురం పట్టణంలో ఆటో డ్రైవర్ పటాన్ మహబూబ్ ఖాన్ తన నిజాయితీని చాటుకున్నాడు. పట్టణంలోని పుత్తూరు హాస్పిటల్ వద్ద రూ. 50 వేలు విలువైన ఖరీదైన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్న వ్యక్తికి, ఆటో డ్రైవర్ ఆ ఫోన్‌ను గుర్తించి పోలీసుల సమక్షంలో అప్పగించాడు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు అభినందించారు.