ప్రొఫెసర్‌గా డా. శ్రీనివాస్‌‌కు పదోన్నతి

ప్రొఫెసర్‌గా డా. శ్రీనివాస్‌‌కు పదోన్నతి

KNR: కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల బోటనీ విభాగాధిపతి డా. తిరుకోవెల శ్రీనివాస్ సీఏఎస్ (CAS) ద్వారా లెవల్-14 ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. కాలేజియేట్ ఎడ్యుకేషన్ పరిధిలో ఈ పదోన్నతులు మొదటిసారి అమలు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.